- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
లయన్స్ క్లబ్ గవర్నర్ గా నంబూరి మధుసూదనరావు ఘన విజయం

దిశ, వైరా : లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320E వైస్ డిస్టిక్ గవర్నర్-2 గా వైరాకు చెందిన లయన్ నంబూరి మధుసూదనరావు ఘన విజయం సాధించారు. నల్గొండలో ఆదివారం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల స్థాయి డిస్టిక్ గవర్నర్-2 ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 113 ఓట్ల మెజార్టీతో నంబూరి మధుసూదనరావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 255 ఫోల్ కాగా నంబూరి మధుసూదనరావుకు 184 ఓట్లు లభించాయి. ఆయనపై పోటీ చేసిన సత్యనారాయణరెడ్డికి కేవలం 71 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా నంబూరి మధుసూదనరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో గవర్నర్-2 గా గెలిపించిన క్లబ్బుల్లో ఉన్న నాయకులు అ౦దరికీ కృతజ్ఞతలు తెలిపారు. VDG 2గా జిల్లాను నె౦ 1 స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. లయన్స్ క్లబ్బుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించి సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటానని పేర్కొన్నారు.
న౦బూరి గెలుపు పట్ల జిల్లా లయన్స్ క్లబ్స్ నాయకులు పీఎస్టీ, ఆర్ సీ, జెడ్ సీ, డీ సీ, పీడీజీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నంబూరికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్, నాయకులు శీలం వెంకటనర్సిరెడ్డి, పొదిలి హరనాథ్, యడ్లపల్లి వీరయ్య, కట్ల రంగారావు, బీఅర్ఎస్ పార్టీ నాయకులు పసుపులేటి మోహనరావు, కర్నాటి హనుమంతరావు, మాదినేని దుర్గాప్రసాద్, కట్టా కృష్ణార్జునరావు, రామాలయం చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు, మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు సూతకాని జైపాల్, ముళ్లపాటి సీతారాములు, రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, సీపీఎం నాయకులు బొంతు రాంబాబు, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ,
గ్రేట్ విజన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీదర్ గౌడ్ , లయన్స్ క్లబ్ అధ్యక్షులు చి౦తొజు నాగేశ్వరరావు, సెక్రటరీ రాయపూడి వెంకటేష్, కోశాధికారి మిట్టపల్లి నాగేశ్వరరావు, జీఎస్టీ కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు, రీజియన్ చైర్మెన్ దారా శ్రీనివాసరావు, జోన్ చైర్మన్ లగడపాటి ప్రభాకర్, మైక్రో క్యాబినెట్ సభ్యులు పెరుమాళ్ల కృష్ణమూర్తి, మిట్టపల్లి నరసింహారావు, మున్సిపాలిటీ కౌన్సిలర్ లు వనమా విశ్వేశ్వరరావు, మాదినేని సునీత, దారేల్లి కోటయ్య, కర్నాటి న౦దిని, దారెలి పవిత్రకుమారి, బత్తుల గీత, డెడి కుమారి, లయన్స్ సభ్యులు చింతనప్పు వెంకటయ్య తదితరులు అభినందనలు తెలిపారు.