- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాగపూర్ అమరావతి హైవే పనులు వేగవంతం..

దిశ, రఘునాధపాలెం: మండల వ్యాప్తంగా శనివారం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ఇండియా (ఎన్ హెచ్ ఐ ఏ) ఆధ్వర్యంలో నాగపూర్ అమరావతి హైవేకు హద్దులు పాతారు. మండల వ్యాప్తంగా పలుచోట్ల రైతుల నుంచి ఫ్లాట్ ఓనర్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా ఎన్ హెచ్ ఐ ఎ, రెవెన్యూ సంయుక్త ఆధ్వర్యంలో హద్దులను గుర్తించారు. మండలంలోని రేగుల చలక, రఘునాధపాలెం, వేపకుంట్ల, వెంకటాయపాలెం, రెవెన్యూల పరిధిలో భూములు గుండా వెళ్తున్న నాగపూర్ అమరావతి హైవే లైన్ కు హద్దులను గుర్తించారు. కేంద్రంలో రఘునాధపాలెం వద్ద జరిగిన చిన్న ఘర్షణతో మండల తహశీల్దార్ లూధర్ విల్సన్, ఆర్ఐ.సత్యనారాయణ, సర్వేయర్ శివ పర్యవేక్షణలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే చేయడం జరిగింది. హద్దులు పాతుతున్న సందర్భంలో భూములు నష్టపోతున్న రైతులు, ప్లాటు యజమానులు ఆందోళన చెంది తమ పత్రాలను తీసుకొచ్చారు. కొందరు రైతులు కొంత అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు తమ పనిని కొనసాగించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.