మురళీకృష్ణ రావు జీవితం ఆదర్శం

by Disha Web |
మురళీకృష్ణ రావు జీవితం ఆదర్శం
X

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

దిశ, సత్తుపల్లి: మురళీకృష్ణ రావు జీవితం ఆదర్శవంతమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక మునిసిపాలిటీ అవరణలో ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ కోటగిరి మురళీకృష్ణా రావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురళీకృష్ణ రావు జీవితం భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సత్తుపల్లి పంచాయతీ రెండు పర్యాయాలు సర్పంచ్ గా ఎన్నికైన మురళీకృష్ణ రావు, పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల్లో అనేక మందిని ఆదరణ పొందారని తెలిపారు. సత్తుపల్లి పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీగా అభివృద్ధి చెందడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. రాజకీయాల్లో్ చెరగని ముద్ర వేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుల్లో కోటగిరి మురళికృష్ణ రావు ఒకరని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు మోనార్క్ రవి, దామెర రమేష్, కోటగిరి వెంకట్రావు, వార్డ్ కౌన్సిలర్లు, అమరవారపు విజయనిర్మల కృష్ణారావు, నడ్డి ఆనందరావు, జమలమ్మ, అద్దంకి అనిల్, దాడి రఘు, పలువురు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story