- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
శానిటరీ ఇన్స్పెక్టర్ పై దాడికి మున్సిపల్ సిబ్బంది నిరసన
by Disha Web Desk 15 |

X
దిశ, ఇల్లందు : మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బండ్ల రాధాకృష్ణ పై ఐదో వార్డ్ కౌన్సిలర్ యలమందల వీణ భర్త వాసు బుధవారం దాడి చేయడాన్ని నిరసిస్తూ మున్సిపల్ శానిటరీ సిబ్బంది గురువారం ఉదయం వారి విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ధర్నా విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ అంకు షావలి మున్సిపల్ కార్మికులతో మాట్లాడారు.
కౌన్సిలర్ భర్త యలమందల వాసు క్షమాపణ చెబితేనే విధులకు హాజరవుతామని కమిషనర్ కు కార్మికులు తెల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో కార్మికుల సమ్మె ప్రభావం చూపుతుందని భావించిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు కౌన్సిలర్ భర్త యలమందల వాసుని పిలిపించి కార్మికుల సమక్షంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణకు క్షమాపణ చెప్పించారు. దాంతో సమస్య సమసిపోయింది.
Next Story