- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పేక మేడ నిర్మాణం పై చర్యలు శూన్యం

దిశ, వైరా : అది ఒక అక్రమ నిర్మాణం. అతి తక్కువ స్థలంలో పేక మేడల ఆరు అంతస్తులు నిర్మించారు. కనీసం ఈ భవనానికి అవసరమైన మేరకు పార్కింగ్ స్థలం కూడా కేటాయించలేదు. కేవలం నాలుగు అంతస్థులకు అనుమతులు పొంది ఏకంగా ఆరు అంతస్తులు నిర్మించారు. నిబంధన ప్రకారం 350 గజాలు లోపు స్థలంలో కేవలం నాలుగు అంతస్తులోపే భవనాన్ని నిర్మించాలి. అయితే ఆ నిబంధనలు ఈ పేక మేడ భవనానికి వర్తించవేమో మరి.. మున్సిపాలిటీ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణం పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అండగా నిలిచింది ఎవరనే అనే ప్రశ్నలు ఉత్పనమవుతున్నాయి. వైరా లోని శ్రీనివాస థియేటర్ పక్కన నిబంధనలకు విరుద్ధంగా పేక మేడ భవనాన్ని ఒక వ్యక్తి నిర్మించాడు.
ఈ భవనానికి కేవలం ఎస్ ప్లస్ 3 అనుమతులు మాత్రమే తీసుకున్నాడు. అయితే అనుమతుల ప్రకారం కేవలం నాలుగు అంతస్తులు మాత్రమే నిర్మించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా ఏకధాటిగా 6 అంతస్తులు నిర్మించేందుకు స్లాబ్ పనులను పూర్తి చేశాడు. ఈ విషయమై దిశ దినపత్రికలో వక్రమార్గం.. అక్రమ నిర్మాణం అనే వార్త కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన మున్సిపాలిటీ అధికారులు సదరు భవన యజమానికి నోటీసులు జారీ చేసి పనులు చేయకుండా నిలిపివేశారు. అయితే శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం 350 గజాలలోపు స్థలంలో నాలుగు అంతస్తులు భవనం మాత్రం నిర్మించాలని మున్సిపాలిటీ చట్టంలో పొందుపరచబడి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా ఆరు అంతస్తులు నిర్మించిన చర్యలు తీసుకునేవారు కరువయ్యారు. మున్సిపాలిటీ అధికారులు కేవలం నోటీసుల మంజూరు కే పరిమితమయ్యారు.
ఈ భవనానికి సరిపడా పార్కింగ్ కూడా కేటాయించలేదు. కమర్షియల్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ భవనానికి కేవలం రెసిడెన్షియల్ అనుమతులే నాలుగంతస్తులకు తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సామాన్యులు చేపడుతున్న ఇండ్ల నిర్మాణాలకు చిన్నపాటి సమస్య ఉన్న హడావుడి చేసి చర్యలు తీసుకునే అధికారులు బడా బాబు విషయంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు వారికే తెలియాలి. ఈ అక్రమ భవన నిర్మాణం పై చర్యలు తీసుకోకుండా అండగా నిలిచేది ఎవరు అని వైరా పట్టణ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. నిబంధనలను పూర్తిస్థాయిలో బేఖాతర్ చేసిన సదరు భవన యజమాని పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం ఈ భవనం బయటకు కనపడకుండా చుట్టుపక్కల మ్యాట్లు వేసి కప్పి వేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకుంటారా..... ఈ భవన నిర్మాణం అంతా సక్రమమేనని సమర్థిస్తారా.... అనే విషయం కోసం వేచి చూడాల్సిందే..