నిండుకుండలా మూకమామిడి ప్రాజెక్ట్

by Sridhar Babu |
నిండుకుండలా మూకమామిడి ప్రాజెక్ట్
X

దిశ, ములకలపల్లి : మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని మధ్యతరహా ప్రాజెక్ట్ మూకమామిడి నిండు కుండను తలపిస్తుంది. ప్రాజెక్ట్ కు వరద నీరు చేరడంతో అలుగు పడింది. వరదల కారణంగా వాగులు వంకలు పొంగి పారుతున్నాయి. బుధవారం 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు స్థానిక తహసీల్దార్ శేషగిరి రావు తెలిపారు. ఇప్పటి వరకు మండలంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు లేవన్నారు. ప్రజలు కూడా అనవసరంగా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విపత్కర పరిస్థితులు ఉంటే సహాయం అందించేందుకు అన్నిశాఖల సిబ్బంది సిద్దంగా ఉన్నారని తెలిపారు.



Next Story