- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వృద్ధురాలిపై కోతులు దాడి

దిశ, అశ్వారావుపేట : ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై కోతులు దాడి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో శనివారం జరిగింది. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ బజార్ లో నివాసముండే రిబ్కామ్మ అనే వృద్ధురాలి ఇంట్లోకి కోతులు చొరబడ్డాయి. వాటిని బయటకు తోలేందుకు ప్రయత్నించిన రిబ్కామ్మ పై కోతుల గుంపు మూకుమ్మడి దాడి చేశాయి.
దీంతో ఆమె చేతికి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఆవరణలో భారీ చింత చెట్లు కోతులకు ఆవాసంగా మారాయి. గతంలోనూ ఇదే బజారుకు చెందిన పలువురుపై కోతులు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. కోతుల బెడద నుంచి కాపాడాలంటూ మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుందని, కోతులను కట్టడి చేయడంలో స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది విఫలం కావడంతో అవి చేలరేగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.