కరాలపాడులో కళేబరాల కలకలం

by Sumithra |
కరాలపాడులో కళేబరాల కలకలం
X

దిశ, కల్లూరు : పెనుబల్లి మండల పరిధిలోని, కర్రలపాడు గ్రామం శివారులో గల చెరువు కట్ట సమీపంలో సుమారు 30 కోతులకు పైగా రెండు బస్తాల్లో చంపి కుక్కి పేడేశారు. సంఘటన స్థలానికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అజాం అలీ చేరుకొని చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కోతులను చంపి పడవేసి ఉంటారని, ఈ నేరానికి పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

గ్రామసర్పంచ్ మల్లయ్యని వివరణ కోరగా గ్రామంలో కోతుల బెడద ఉందని గ్రామంలో కొందరు రైతులు కలిసి కోతులు పట్టే వ్యక్తిని తీసుకొచ్చారని కేవలం బెదిరించడానికి మాత్రమే వారు చేశారు కానీ, చంపే ప్రయత్నం చేయలేదని, నేరానికి పాల్పడిన వారు ఎవ్వరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. పూర్తి తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed