మోగిన సింగరేణి ఎన్నికల నగారా

by Sridhar Babu |
మోగిన సింగరేణి ఎన్నికల నగారా
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ఎట్టకేలకు సింగరేణి ఎన్నికల నగారా మోగింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ ను డిప్యూటీ చీఫ్ లేబర్ కమి షనర్ ( సెంట్రల్ ) బుధవారం నోటిఫికేషన్ ను విడుదల చేశారు. కాగా అక్టోబర్ 28న ఎన్నికలు జరగనున్నట్లు నోటిఫికేషన్ లో పొందుపరిచారు. నామి నేషన్ల స్వీకరణ అక్టోబర్ 6 కాగా చివరితేదీ అక్టోబర్ 7 . విరమించుకునెందుకు అక్టోబర్ 10 వరకు గడువును ఇచ్చారు. సింబల్స్ ను అక్టోబర్ 10 న కేటాయిస్తారు. ఎన్నాళ్ల గానో ఎదురుచూస్తున్న ఎన్నికల సమయం ఆసన్నమవడంతో సింగరేణిలోని అన్ని సంఘాలలో హడావుడి ప్రారంభం కానుంది.

Advertisement

Next Story

Most Viewed