- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
చర్ల మండలం కేశపురం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గిరిజన వీరుడు కొమురం భీమ్ విగ్రహాన్ని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఘనంగా ఆవిష్కరించారు.

దిశ చర్ల : చర్ల మండలం కేశపురం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గిరిజన వీరుడు కొమురం భీమ్ విగ్రహాన్ని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కొమురం భీమ్ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గిరిజన వీరుడు కొమురం భీమ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొమురం భీమ్ గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని, ఆయన పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు. ఈ విగ్రహం భవిష్యత్ తరాలకు కొమురం భీమ్ గొప్పతనాన్ని గుర్తు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






