మంత్రి హరీష్ రావు కి ఎమ్మెల్యే సండ్ర కృతజ్ఞతలు

by Sridhar Babu |
మంత్రి హరీష్ రావు కి ఎమ్మెల్యే సండ్ర కృతజ్ఞతలు
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ నూతన భవనాల నిర్మాణాలు, ప్రాథమిక వైద్య కేంద్రాల్లో సదుపాయాలను, అదనపు సబ్ సెంటర్లను కేటాయించి నియోజకవర్గ వ్యాప్తంగా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తోడ్పడిన మంత్రి హరీష్ రావు కి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హైదరాబాద్​ సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైద్య సదుపాయాల కల్పనతో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణ, ప్రణాళికలతో ప్రభుత్వ వైద్యం ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి అందుతుందని వివరించారు.



Next Story

Most Viewed