నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలపై ఎమ్మెల్యే సమీక్ష

by Sridhar Babu |   ( Updated:2023-08-12 15:03:19.0  )
నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలపై ఎమ్మెల్యే సమీక్ష
X

దిశ, పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో శనివారం కలెక్టర్ ప్రియాంక అల ను కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా కొత్తగూడెం నియోజకవర్గంలో చేపడుతున్, ప్రభుత్వం నుండి మంజూరైన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, సజాతానగర్, పాల్వంచ మండలంలో చేయాల్సిన అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మి, వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, పాల్వంచ, జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్యా రాంబాబు పాల్గొన్నారు.



Next Story

Most Viewed