ఎమ్మెల్యే రాములు నాయక్ రాజీనామా చేయాలి

by Shiva |
ఎమ్మెల్యే రాములు నాయక్ రాజీనామా చేయాలి
X

మార్క్ ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్

దిశ, వైరా: 2018 సాధారణ ఎన్నికల్లో మా కష్టంతో స్వతంత్ర అభ్యర్థిగా లావుడియా రాములు నాయక్ గెలుపొందారు. ప్రతికూల వాతావరణంలో కూడా రాములు నాయక్ ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు భవిష్యత్తులో ఎదురయ్యే ఆటుపోట్లను లెక్క చేయలేదని మార్క్ ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ అన్నారు. వైరా లోని వాసవి కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని పొంగులేటి వర్గీయులు, మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ తో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాములు నాయక్ గెలిచాక తాము కూడా ఆయనతో పాటే బీఆర్ఎస్ లో చేరామని తెలిపారు. మా కష్టానికి ప్రతిఫలంగానే పదవులొచ్చాయని తెలపారు. తాము పదవులకు రాజీనామా చేయాలంటే ముందుగా ఎమ్మెల్యే రాములు నాయక్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పొంగులేటిపై వివర్శలు చేసిన విమర్శలు చేసిన తాత మధుకు దమ్ము, ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఒక వేళ డిపాజిట్ వచ్చినా పొంగులేటి వర్గీయులు అంతా రాజకీయ సన్యాసం చేస్తామని తెలిపారు. వైరాలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో ఐదెకరాల స్థలంలో15న వైరా నియోజకవర్గ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సమ్మేళనానికి సుమారు 10వేల మంది నియోజకవర్గం నుంచి హాజరవుతారని వివరించారు. శ్రీనివాసరెడ్డి వర్గం నుంచి బానోతు విజయబాయి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో బీఆర్ఎస్ లో వణుకు మొదలైందన్నారు. దీంతోనే పొంగులేటి వర్గీయులపై పార్టీ బహిష్కరణతో పాటు అత్యవసర బీఆర్ఎస్ సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు. ఈ సమావేశంలో వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, రైతుబంధు సమితి వైరా, కారేపల్లి మండల కన్వీనర్లు మిట్టపల్లి నాగేశ్వరరావు, గుగులోత్ శ్రీను, జూలూరుపాడు ఎంపీటీసీ తూర్పు మధుసూదన్ రావు, పెద్ద మునగాల సర్పంచ్ పరికపల్లి శ్రీను, మాధార౦ సర్పంచ్ అజ్మీర్ నరేష్, తనికెళ్ల ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు, జూలూరుపాడు సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, మల్లె నాగేశ్వరరావు, పొలా శ్రీనివాసరావు, శ్రీనాథ రాజు, నాగరాజు, ఎల్లంకి చిన్న నాగేశ్వరరావు, పుల్లారావు, నరేంద్ర నాయుడు, ఇజ్జగాని శివ, షేక్ జాన్ పాషా, జాలాది రామకృష్ణ, యర్రా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు



Next Story

Most Viewed