వైద్య విద్యార్థిని మృతికి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సంతాపం

by samatah |
వైద్య విద్యార్థిని మృతికి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సంతాపం
X

దిశ, ఇల్లందు : వైద్య విద్యార్థిని ధారావత్ ప్రీతి నాయక్ మృతి పట్ల ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ సంతాపం తెలియజేశారు. ఆమె మృతి అత్యంత బాధాకరం అన్నారు. ప్రీతి ఆరోగ్యంగా తిరిగి వస్తుందని అందరం ఆశించామని పేర్కొన్నారు. కానీ ఆమె మరణ వార్త వినవలసి వస్తుందని ఊహించలేదని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆమె మృతికి కారణమైన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.



Next Story

Most Viewed