ఉద్యమకారులను మోసం చేసిన చరిత్ర ఎమ్మెల్యే హరిప్రియది

by Disha Web Desk 15 |
ఉద్యమకారులను మోసం చేసిన చరిత్ర ఎమ్మెల్యే హరిప్రియది
X

దిశ, ఇల్లందు : తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు ఎన్నో ఉద్యమాలను చేసి చివరికి జైలు జీవితం గడిపిన ఉద్యమకారులను ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మోసం చేశారని తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు నామినేటెడ్ పోస్టులు ఇస్తానని చెప్పి తన చుట్టూ సంవత్సరాల కొద్ది తిప్పించుకొని చివరికి తన భర్త హరి సింగ్ నాయక్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇప్పించడం సిగ్గుచేటు అన్నారు. ఉద్యమ కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దిండిగల రాజేందర్ ఎమ్మెల్యే తొత్తుగా మారి ఉద్యమకారులకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం ఆయనకే చెల్లుతుందన్నారు.

ఉద్యమకారుల కోసం ఏనాడు కూడా దిండిగల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు అడిగిన రోజులు లేవన్నారు. ఉద్యమకారుడు దేవి లాల్ నాయక్, నవీన్ , బీబీ వంటి ఉద్యమకారులకు అన్యాయం జరిగితే ఏ రోజు కూడా ఎమ్మెల్యే తో మాట్లాడలేదన్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని పొందడానికి అప్పటి ఎమ్మెల్యే కోరం కనకయ్య తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ తో మాట్లాడి తెలంగాణ ఉద్యమకారుడు దిండిగల రాజేందర్ కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంస్థ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పినట్టు పేర్కొన్నారు. కోరం కనకయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉద్యమకారులను గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి, మండల అధ్యక్ష పదవి, టౌన్ అధ్యక్ష పదవులను ఇచ్చి గౌరవించారన్నారు .

నేడు తనకు పదవి ఇప్పిచ్చిన కోరం కనకయ్య పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎమ్మెల్యే హరిప్రియ తొత్తుగా వ్యవహరించడం ఆయనకే చెందుతుందన్నారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కోరం కనకయ్య భార్య మరదలు భూములను కబ్జా చేశారని ఆరోపించడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కారులు భూక్యా నాగేశ్వరరావు, సువర్ణపాక సత్యనారాయణ, గోనెల సిద్ధయ్య, కౌన్సిలర్ పత్తి స్వప్న, సర్పంచ్ పాయం స్వాతి, ఎంపీటీసీలు మండల రాము,పూనెం సురేందర్, తాటి యశోద, ఉప సర్పంచ్ తాటి రాంబాబు, నాయకులు బోళ్ళ సూర్యం, చిల్లా శ్రీనివాసరావు, ఊరుగొండ ధనుంజయ్, తాటి భిక్షం, ముక్తి కృష్ణ, పోలేబోయిన వెంకటేశ్వర్లు, కాకటి భార్గవ్, గుగ్లోత్ నాగార్జున, పత్తి రంజిత్, కుంటా రాజు, రావూరి సతీష్, అజ్జు, శెట్టిపెల్లి రవి, దుర్గా పాల్గొన్నారు.


Next Story

Most Viewed