ఎమ్మెల్యే గారు... ఇక రిటైర్మెంట్ తీసుకోండి : గడల

by Sridhar Babu |
ఎమ్మెల్యే గారు... ఇక రిటైర్మెంట్ తీసుకోండి : గడల
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ఇక రిటైర్మెంట్ తీసుకోండి అని ఎమ్మెల్యే వనమా కు డాక్టర్ గడల సలహా ఇచ్చారు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికలే లాస్ట్.. ప్లీజ్ ఒక్కసారి గెలిపించండి అని ఎమ్మెల్యే వనమా గత ఎన్నకల్లో అన్నారని గుర్తు చేశారు. ఉల్వనూరు గ్రామంలో వాలీబాల్ పోటీల ప్రారంభం సందర్బంగా ఆదివారం హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ పై విధంగా హాట్ కామెంట్స్ చేశారు. 80ఏళ్లు నిండిన ఎమ్మెల్యే ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించారు. 50 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి చేశారని ఎద్దేవా చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో తన తండ్రి 50 ఏళ్లు ఆయుర్వేదిక్ డాక్టర్ గా సేవ చేశారన్నారు. ఆదివాసీలు తమను గుండెల్లో పెట్టుకున్నారని, వారి రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. తన ప్రోగ్రాం కు వెళితే పదవి పోతుందని, దళిత బంధు ఆపుతా అని ఎమ్మెల్యే వర్గం బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. అందరూ తనతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.



Next Story