లలితా జ్యూవెలరీ 60వ బ్రాంచ్ ను ప్రారంభించిన మంత్రులు..

by Sumithra |
లలితా జ్యూవెలరీ 60వ బ్రాంచ్ ను ప్రారంభించిన మంత్రులు..
X

దిశ, ఖమ్మం సిటీ : నమ్మకానికి , నాణ్యతకు చిరునామా... లలితా జువెల్లరీ షోరూమ్ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అన్నారు. శనివారం ఖమ్మంలోని లలితా జువెల్లెరి 60 వ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు శుభసూచికమని, లలితా జ్యూవెల్లరీ అధినేత కిరణ్ కుమార్ సేవలు ప్రశంసనీయమైన మంత్రులు అన్నారు. 41 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి అని వారన్నారు.

తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉందని, తద్వార ప్రజలు పెద్ద మొత్తంలో తమ కష్టార్జితాన్ని ఆదా చేయవచ్చు ! అంతేకాదని, ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్లోనే ఇతర షోరూంలలో లభించని సరికొత్త 'బంగారు నగల కొనుగోలు పథకం'ను కూడా అందిస్తోందని వారన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విశేష ఆదరణను పొందింది లలితా జ్యువెల్లరి అని వారన్నారు. అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు, తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో, వినియోగదారుల ఆశీస్సులతో ఈ షోరూంలను ఆరంభిస్తుండటం మరింత విశేషం అని అన్నారు.

అనంతరం లలితా జ్యూవెలరీ షోరూమ్ అధినేత కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమ బ్రాంచులు "వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, భీమవరం, కాకినాడ, చిత్తూరు, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, గుంటూరు, శ్రీకాకుళం, గోపాలపట్నం, అనకాపల్లి, గాజువాక, విజయనగరం, తుని, అనంతపురం, కడప, ఒంగోలు, కర్నూలు, నరసారావుపేట, అమలాపురం, నిజామాబాద్, వరంగల్, మిర్యాలగూడ, హైదరాబాద్లోని కూకట్పల్లి, సోమాజిగూడ, దిల్షుఖ్నగర్, చందానగర్, సుచిత్రాసర్కిల్ షోరూంలకు ప్రజల నుంచి దక్కిన విశేష ఆధరణను చూసి.. దక్షిణభారతదేశం వ్యాప్తంగా మా సేవలు విస్తృతం చేయాలనుకుంటున్నామని అన్నారు. ఖమ్మం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ స్థాయిలో ప్రజలు మా ఇతర షోరూంలకు వచ్చి నగలు కొనుగోలు చేస్తున్నారని అన్నారు.

తొలుత షోరూమ్ ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించిన అంనంతరం జ్యోతిప్రజ్వలన గావించారు. అనంతరం షోరూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మేయర్ పునుకొల్లు నీరజ, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పోరేషన్ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జొహారా తదితరులు పాల్గొన్నారు.

Next Story