కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి..ఆశ్చర్యానికి లోనైన మహిళలు..

by Aamani |
కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి..ఆశ్చర్యానికి లోనైన మహిళలు..
X

దిశ,నేలకొండపల్లి : నాకు వ్యవసాయం చేయడం ఇష్టం.. నాన్న బతికి ఉన్నప్పుడు ఆయనతో కలిసి నా చిన్నతనంలో పొలాల్లో పని చేసేవాడినని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నేలకొండపల్లి మండల పర్యటనలో భాగంగా కొంగర సమీపంలోని పొలాల వద్ద పనిచేస్తున్న మహిళా కూలీలను చూసి ఆయన కాన్వాయ్ ఆపారు.వారి వద్దకు వెళ్లి అక్కా చెల్లి అంటూ వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ నెల 26వ తేదీ నుంచి అమలు కాబోతున్న పథకాల గురించి వారికి వివరించారు. ఆ పథకాల జాబితాలో పేర్లు రాని వారు ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో పేర్లు నమోదు చేసుకుంటే పరిశీలించి ఆ పథకాలను అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే పెన్షన్లు కూడా ఇస్తామన్నారు.అక్క చెల్లమ్మ లందరూ గాజులు వేయించుకోండని చెబుతూ కొంత నగదు ఇచ్చారు. దీంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి తమతో మాట్లాడటంపై వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.

Advertisement

Next Story

Most Viewed