- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కార్యకర్తలను కలుస్తూ... పరామర్శలు చేస్తూ...
దిశ, కారేపల్లి : కారేపల్లి మండలంలో వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ పర్యటన గురువారం విస్తృతంగా సాగింది. తీవ్రమైన ఎండ ను సైతం లెక్క చేయక మండలంలో కార్యకర్తలను కలుస్తూ బాధితులను, వారి కుటుంబాలను పరామర్శిస్తూ పర్యటించారు. పాటిమీదిగుంపులో చందావత్ మహేష్ వివాహవేడుకకు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. బాజుమల్లాయిగూడెంలో మద్దెల హరీష్ కుమారుడి అన్నప్రాసన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
బీఆర్‌ఎస్ కార్యకర్త ముత్తినేని సైందుకు వెన్నుపూస ఆపరేషన్ కావటంతో అతనిని, చీమలపాడు పేలుడు ఘటనలో గాయపడిన అరుణను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బోటితండాలో అఖిల, నరేష్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సర్పంచ్ ధర్మసోత్ మౌనిక అత్త ఇటివల మృతి చెందటంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ధర్మసోత్ రవికుమార్ తల్లి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా అమెను కలిసి ఆరోగ్యంపై ఆరాతీశారు. చింతలతండాలో ఇటీవల మృతి చెందిన కుర్ర లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించి లక్ష్మన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లుఆర్పించారు.
మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ వెంట కారేపల్లి జెడ్పీటీసీ వాంకుడోత్ జగన్, రైతు బంధు జిల్లా సభ్యులు ఉన్నం వీరేందర్, సర్పంచ్ ధర్మసోత్ మౌనిక, ఉపసర్పంచ్ రవీందర్, నాయకులు పాటి రాంబాబు, చెన్నయ్య, గణితి సత్యనారాయణ, కారేపల్లి పదో వార్డు మెంబర్ ఎస్‌కె.గౌసుద్దీన్, భూక్యా చందునాయక్, మాలోత్ స్వామి, బానోత్ రాజేష్, దారావత్ వికాస్, బల్లి అప్పారావు, తెల్లగొర్ల రామారావు, పొడుగు హరీష్, మాలోత్ బావుసింగ్, రవికుమార్ ఉన్నారు.