వివాహిత అదృశ్యం

by Sridhar Babu |
వివాహిత అదృశ్యం
X

దిశ, ఖమ్మం రూరల్​ : వివాహిత అదృశ్యమైన సంఘటన రూరల్​ మండలంలో జరిగింది. వివరాల ప్రకారం.. రూరల్​ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన గూడ మధుష అలియాస్​ మౌనికను మహుబాబాద్​ జిల్లా డొర్నకల్లు మండలం దేవునిసంకీస గ్రామానికి చెందిన పెంతల నరేష్​రెడ్డికి ఇచ్చి గత పది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. మధుష తండ్రి ఇటీవల మరణించగా రూరల్​ మండలం సత్యనారాయణపురంలోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పడుకుని నిద్రలేసే సరికి బుధవారం మధుష కనిపించలేదు. చుట్టాల మార్గంతో పాటు అనేకచోట్ల అన్వేషించి రూరల్​ పోలీసులకు తల్లి సుజాత ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ‌‌ 2 రవూప్​ తెలిపారు.



Next Story