పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

by Disha Web |
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, దమ్మపేట : బయటికి వెళ్లి వస్తా ద్విచక్ర వాహనం ఇవ్వమని తండ్రిని అడగగా ఇవ్వలేదనే కోపంతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సుధా పల్లి గ్రామానికి చెందిన సోడేం నాగబాబు మద్యానికి బానిస అయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చి తండ్రి వెంకటేశ్వరరావును బయటకు వెళ్లడానికి తన ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఇవ్వమని అడిగాడు. దీంతో తండ్రి ఇవ్వకపోవడంతో వెంటనే పురుగుల మందు తాగాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నాగబాబును దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.Next Story