కాంగ్రెస్ కు మల్కారం సర్పంచ్ రాజీనామా

by Sridhar Babu |
కాంగ్రెస్ కు మల్కారం సర్పంచ్  రాజీనామా
X

దిశ, దమ్మపేట : కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకుడు, మల్కారం గ్రామ సర్పంచ్ రూప్ సింగ్, మరో 4 వార్డ్ మెంబర్ల తో కలిసి ఆదివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గుత్తావారిగూడెం గ్రామంలోనీ బీఆర్ఎస్ నాయకుడు గుత్తా రాజా స్వగృహంలో చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఇంటింటికి కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపడతామని,

ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమిష్టిగా కృషి చేయాలని కోరారు. మల్కారం గ్రామానికి చెందిన బలమైన నాయకుడు సర్పంచ్ రూప్ సింగ్ పార్టీలో చేరడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు , దారా యుగంధర్,మల్లాది గంగరాజు, గుత్తా రాజ, జలగం వాసు,మాజీ ఎంపీపీ అల్లం వెంకమ్మ, అంకత ఉమ మహేశ్వరరావు, బుద్దే కోటేశ్వరరావు , తిరువిదుల జేమ్స్, తాటి ప్రదీప్ చంద్ర, రఘు, అబ్దుల్ జిన్నా తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed