కాంగ్రెస్ ను గెలిపించి సోనియమ్మ రుణం తీర్చుకుందాం : మాజీ మంత్రి సంభాని

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ ను గెలిపించి  సోనియమ్మ రుణం తీర్చుకుందాం : మాజీ మంత్రి సంభాని
X

దిశ, వేంసూర్ : సత్తుపల్లి నియోజకవర్గంలో 53వ రోజు హాత్​ సే హాత్​ జోడో యాత్రలో భాగంగా వేంసూరు మండలం భీమవరంలో మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని రాహుల్ గాంధీ సందేశాన్ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన చార్జిషీట్‌ని ప్రజలకు అందించారు. నాటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని గుర్తుచేశారు. రాజకీయంగా కాంగ్రెస్‌ నష్టపోతుందని తెలిసినా యువకుల బలిదానాలకు సోనియా గాంధీ చలించిపోయి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని చెప్పారు.

కానీ కేసీఆర్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాల ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టారంటూ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియమ్మ రుణం తీర్చుకుందామని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి ఇస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని, వైద్యం కోసం ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా 5 లక్షలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసి మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా ఇస్తామన్నారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెలా రూ. 4000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు.18 ఏళ్లు పైబడిన బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, స్టేట్ ఎస్సీ కన్వీనర్ కొండూరు కిరణ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పుచ్చకాయల సోమిరెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర చంద్రశేఖర్ రెడ్డి, బోళ్ళ నరసింహారావు , మండల కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మందలపు శ్రీనివాసరావు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు కోట సత్యనారాయణ, మండల యువజన అధ్యక్షుడు కవి శెట్టి వేణు, మండల ఉపాధ్యక్షుడు ముద్దం సత్యనారాయణ, అడసర్లపాడు సర్పంచ్ ప్రేమలత బుచ్చాలు, ఉప సర్పంచ్ రత్నం, లక్ష్మారెడ్డి, బేతిని శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed