దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం : ఎమ్మెల్యే సండ్ర

by Disha Web Desk 15 |
దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం : ఎమ్మెల్యే సండ్ర
X

దిశ, సత్తుపల్లి : తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు నిర్ణయించిన విధంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను సత్తుపల్లి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధికారులకు, బీఆర్ఎస్ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సత్తుపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయని చెప్పారు.

రేపు ఉదయం కొత్తూరు రైతువేదిక నుంచి కాకర్లపల్లి వరకు ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించి రైతులతో సహపంక్తి భోజనాలు చేయనున్నామని చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 35 రైతువేదికలు ఉన్నాయని, అక్కడ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేలా అధికార యంత్రాంగం సన్నద్ధమైందని, నేడు జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్సీ తాతా మధు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 ఏళ్లు పూర్తయి 10వ వసంతంలోకి ఆడుగుపెడుతున్న సందర్భంగా ప్రభుత్వం 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు.

ఈ సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో ప్రభుత్వ శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియచేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి పూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, సొసైటీ చైర్మన్ చల్లగుళ్ళ కృష్ణయ్య ,మున్సిపల్ కౌన్సిలర్ గ్రాండ్ మౌలాలి, గఫార్ ,అద్దంకి అనిల్, గుండ్ర రఘు, అమరవరం కృష్ణారావు, మేకల నరసింహారావు, శ్రీనివాసరావు, నడ్డి ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed