తెలంగాణ ఆవిర్భావ స్ఫూర్తితో సత్తుపల్లి జిల్లా సాధిద్దాం : మానవతారాయ్

by Disha Web Desk 15 |
తెలంగాణ ఆవిర్భావ స్ఫూర్తితో సత్తుపల్లి జిల్లా సాధిద్దాం : మానవతారాయ్
X

దిశ, సత్తుపల్లి : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పౌరులపై ఉందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవతారాయ్ తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలిసి ఉన్న చిత్రపటాన్ని సత్తుపల్లి పట్టణంలో భారీ జన సమీకరణతో ఊరేగించి బోసు బొమ్మ సెంటర్ వద్ద క్షీరాభిషేకం చేశారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్ కున్న రెండు ఎంపీలతో రాజ్యాంగబద్ధ తెలంగాణ సాధ్యం కాదని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలు అందరినీ కూడగట్టి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ చేసినటువంటి ఘనత సోనియా గాంధీదని ఆయన కీర్తించారు.

సత్తుపల్లి ప్రజల్లో చిరకాలంగా ఉన్న సత్తుపల్లి జిల్లా ఉద్యమానికి నడుం బిగిస్తున్నట్టు మానవత రాయ్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సత్తుపల్లి జిల్లాను చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ పోరాట యోధులు మేడ విజయ్ బాబు, మిరియాల రవి, నంది కోలా మారేశ్వర్ రావు, నూరుద్దీన్ లను శాలువాతో సన్మానించారు. అనంతరం దుద్దేపూడికి చెందిన అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ ఈర్ల వెంకటేశ్వరరావును శాలువాతో సత్కరించారు. అడసర్ల పాడుకు చెందిన ప్రముఖ పాస్టర్ నక్క సుందర్రావు ని సన్మానించి వారి ప్రార్థనా మందిరానికి సీలింగ్ ఫ్యాన్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సెక్రటరీ రావి నాగేశ్వరరావు, గాది రెడ్డి సుబ్బారెడ్డి, ఐ కృష్ణ, మందలపు శ్రీనివాస్ రెడ్డి, పుచ్చకాయల రవి, దామాల రాజు, కంభంపాటి కాంతారావు,

ఫజల్ రహమాన్ బాబా, కొమ్మేపల్లి బాజీ, కొమ్మేపల్లి ఖలీల్, బచ్చు వెంకటేశ్వరరావు, పాశం నాగేశ్వరావు, కర్ణాటక వెంకటరెడ్డి, జానీ పాషా, గుగులోతు కృష్ణ రాగం సత్యనారాయణ, పసల ఏడుకొండలు, మోరు బోయిన ప్రసాద్ యాదవ్, బలుసు పాటి వెంకటేశ్వర్లు, వెల్లంపల్లి ఏడుకొండలు, యాకూబ్,రహీం, ముద్దు, యూసఫ్ పటాన్, గుర్రాల దేవ ప్రియుడు, ఇంతియాజ్, ఖాదర్ బాబా, జానీ ఖాన్, అర్పత్ పాషా, మేకపోతుల భరత్, కారుమంచి రవీంద్ర, వలసపల్లి రమేష్,వేముల లక్ష్మి, బత్తుల లక్ష్మి, పొన్నమ్మ, సుందరమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.



Next Story