- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కమల్ రాజును ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం

దిశ, ముదిగొండ : అందరం కలిసికట్టుగా పనిచేసి కమల్ రాజును ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చింతనిప్పు కృష్ణచైతన్య అన్నారు. మండల కేంద్రమైన ముదిగొండలో గురువారం మండల పార్టీ యూత్ అధ్యక్షుడు బండ్ల వాసు అధ్యక్షతన ఏర్పాటు చేసిన యువజన విభాగం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, కార్యదర్శులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. గ్రామంలోని కార్యకర్తలతో, గ్రామస్తులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
లింగాల కమల్ రాజును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మండలంలో మన ముందు ఉండే నాయకుడని, మండల అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెసుకోవచ్చునన్నారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. కొంతమంది పని లేక మన నాయకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం టౌన్ అధ్యక్షులు బలుసు మురళి కృష్ణ, మధిర నియోజకవర్గ ఇంచార్జ్ నరేందర్ రెడ్డి, ముదిగొండ సోషల్ మీడియా అధ్యక్షులు దారా రాము, కార్యదర్శి పాషా, చింతకాని మండల యువజన విభాగం అధ్యక్షులు శ్రీను, దరిపల్లి వీరబాబు పాల్గొన్నారు.