- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అలుగు పోస్తున్న పాలేరు రిజర్వాయర్

దిశ, కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాలకు 8 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. రిజర్వాయర్ లో ఇప్పటికే 23 అడుగులు దాటింది. దీంతో జలాశయం ఫాలింగ్ గేట్ల ద్వారా పరవళ్లు తొక్కుతూ జలాశయం అలుగు పోస్తుంది. దీంతో నీరు వృథా కాకుండా పాలేరు పాత కాలువకు 200 క్యూసెక్కులు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీటిని చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పాలేరు రిజర్వాయర్ ను ఎన్నెస్పీ ఎస్ ఈ, ఈఈ, డీఈలు పరిశీలించారు.
పాలేరు రిజర్వాయర్ అలుగుల వద్ద పర్యాటకుల సందడి
పాలేరు జలాశయం వద్ద అలుగు పోస్తున్నడంతో ఖమ్మం సూర్యాపేట రహదారి గుండా ప్రయాణం కొనసాగించే ప్రయాణికులు, పర్యాటకులు, పలు గ్రామాల ప్రజలు పాలేరు అలుగు పారుతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సమాచారం తెలుసుకొని అక్కడికి తరలివస్తున్నారు. జలాశయం వద్దకు చేరుకొని తమ సెల్ఫోన్లలో ఫొటోస్ తీసుకుంటున్నారు. కూసుమంచి సీఐ జితేందర్ రెడ్డి, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పాలేరు జలాశయం దగ్గరకు వెళ్లకుండా సహాయక చర్యలు ముమ్మరం చేశారు.