ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేయటం తప్పా.. ఎమ్మెల్యే సండ్ర

by Sumithra |
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేయటం తప్పా.. ఎమ్మెల్యే సండ్ర
X

దిశ, సత్తుపల్లి : రాజకీయ జీవితంలో ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేసామే తప్ప ఎన్నడూ సత్తుపల్లి నియోజకవర్గంలో దొరల వ్యవహరించలేదని, దళితుల పై, దళితుల ఎదుగుదల పై పొంగిలేటికి చిన్నచూపు తగదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీ ఆవరణంలో మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ, సత్తుపల్లి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశానని, మీరు మంత్రి కేటీఆర్ ను పలుమార్లు వెంటబెట్టుకొని హెలికాప్టర్లో దొరల వ్యవహరించింది మీరు అని, సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ప్రకటించకుండా నాలుగు ఆఫీసులతో నలుగురు అభ్యర్థులను రంగంలోదించి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులను పెంచి పోషిస్తుంది మీరు కాదా, ఈ విషయాన్ని నిన్న సోషల్ మీడియా వేదికగా తాటి వెంకటేశ్వర్లు చేసిన ఆరోపణలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో కూడా వర్గాలను పెంచి పోషించింది మీరేనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేసే స్థాయి మీది కాదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలకు హతవు పలికారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు ప్రకటించే దమ్ముధైర్యం లేకుండా అని అన్నారు. అనంతరం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా అనంతరం మున్సిపల్ సిబ్బందికి నూతన యూనిఫామ్ లు అందజేశారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని 47 సంవత్సర సందర్భంగా 47 కేటీఆర్ చిత్రాలను మున్సిపల్ ఆవరణంలో ప్రముఖ చిత్రకారుడు బాలకృష్ణ ఏర్పాటు చేయటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా చిత్రకారుడు బాలకృష్ణను కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సండ్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.సుజాత, మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మోనార్క్ రఫీ, ప్రధాన కార్యదర్శి మల్లూరు అంకమ్మరాజు, పలువురు వార్డు కౌన్సిలర్లు అద్దంకి అనిల్, చాంద్ బాషా, తడికమల్ల ప్రకాశరావు, కంటి అప్పారావు, వీరపనేని బాబీ రాధిక, నరుకుళ్ళ శ్రీనివాసరావు, యువజన నాయకులు, వల్లభనేని పవన్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed