కంటివెలుగుతో అంధత్వ నివారణ: ఎంపీపీ మాలోత్‌ శకుంతల

by Dishanational1 |
కంటివెలుగుతో అంధత్వ నివారణ: ఎంపీపీ మాలోత్‌ శకుంతల
X

దిశ, కారేపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు అంధత్వ నివారణే లక్ష్యంగా చేపట్టినట్లు కారేపల్లి ఎంపీపీ మాలోత్‌ శకుంతల అన్నారు. మంగళవారం బాజుమల్లాయిగూడెంలో కంటివెలుగు శిబిరాన్ని ఎంపీపీ, సర్పంచ్‌ కోరం కోటమ్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కంటి వ్యాధులకు పట్టణాలకు పోకుండా గ్రామాల్లోనే కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన కళ్లజోళ్లు, మందులు, శస్త్ర చికిత్సలు సైతం చేయించటం జరుగుతుందన్నారు. కంటి వెలుగు శిబిరాల్లో నైపుణ్యం గల వైద్యులు, సిబ్బంది వైద్య సాయం చేస్తున్నారన్నారు. కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్యాదికారులు డాక్టర్‌ శ్రేష్ఠ, డాక్టర్‌ రంజిత్‌ లు మాట్లాడుతూ బాజుమల్లాయిగూడెం, మాదారం గ్రామాల్లో మంగళవారం జరిగిన వైద్య శిబిరాల్లో 256 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 91 మందికి కళ్లజోళ్లను పంపిణీ చేయగా మరో 39 మందికి అవసరమైన కంటి అద్దాలకు ఇండెంట్‌ పెట్టినట్లు తెలిపారు. 42 మందికి శస్త్ర చికిత్సలు అవసరంగా గుర్తించామన్నారు. ఈ శిబిరాలల్లో హెల్త్‌ సూపర్‌వైజర్లు, జ్యోతి లక్ష్మి, సూర్యం, విజయకుమారి, ఏఎన్‌ఎంలు ఉండం రాధ, ఉషారాణి, ముక్తి నాగమణి, ధనలక్ష్మి, కృష్ణవేణి, చందన, సునితి, మణి, తారాలు వైద్య సేవలు అందజేశారు.



Next Story

Most Viewed