అశ్వారావుపేట నియోజకవర్గ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఈశ్వరప్రగడ..

by Sumithra |
అశ్వారావుపేట నియోజకవర్గ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఈశ్వరప్రగడ..
X

దిశ, దమ్మపేట : అశ్వారావుపేట నియోజకవర్గ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా దమ్మపేట మండలం గురవాయిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువనాయకుడు ఈశ్వరప్రగడ నాగభూషణ రావు ఎంపికయ్యారు. ఈ నియామకాన్ని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సోమవారం ప్రకటించారు.

ఈ సందర్భంగా యువ నాయకుడు నాగభూషణ్ రావు తనకు పదవి వచ్చిన సందర్భంగా మంగళవారం ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ వైస్ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాగభూషణ్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు జారే ఆదినారాయణ, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు నర్సి, మైనార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్,ఐఎన్టియుసి అధ్యక్షులు రొయ్యల కుమార్, ఆళ్ల మణిరత్నం తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed