బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

by Kalyani |
బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు
X

దిశ, దమ్మపేట: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మపేట మండల కేంద్రంలోనీ ఓ కాలనీకి చెందిన బాలిక తన తమ్ముడితో కలిసి వాళ్ల అమ్మమ్మ సమాధి వద్దకు నివాళులర్పించడానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, దమ్మపేట మండలం అర్బన్ కాలనీకి చెందిన కౌలురీ వినోద్ బాలిక చేయి పట్టుకొని లాగాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేసి అతని నుంచి తప్పించుకొని వెళ్లి జరిగిన విషయం ఆమె అన్నయ్యకు చెప్పింది. ఆమె అన్నయ్య నిందితుడిని జరిగిన విషయంపై ప్రశ్నించగా దుర్భాషలాడాడు. దీంతో నిందితుడిపై బాలిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడి పై కేసు నమోదు చేశారు.



Next Story