అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు స్వాధీనం

by Disha Web Desk 15 |
అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు స్వాధీనం
X

దిశ,ముదిగొండ : మండల పరిధిలోని పండ్రేగుపల్లి గ్రామంలోని బీవీఆర్ స్టోన్ కర్షర్ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను శనివారం టాస్క్ఫోర్స్ ఏసీపీ శివరామయ్య అదేశాల మేరకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.4లక్షల 36 వేల విలువైన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ముదిగొండ పోలీసులకు అప్పగించారు. క్వారీలో అనుమతి లేకుండా అక్రమంగా పేలుళ్లు జరిపేందుకు పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన బీవీఆర్ స్టోన్ కర్షర్ యజమానిపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. సీఐ తిరుపతి, ముదిగొండ ఎస్సై నరేష్, టాస్క్ ఫోర్స్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


Next Story

Most Viewed