జోరుగా మట్టి తవ్వకాలు.. కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు

by Dishanational4 |
జోరుగా మట్టి తవ్వకాలు.. కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు
X

దిశ, ముదిగొండ: బయట ప్రభుత్వ ఆస్తులు ఎన్ని పోయిన పెద్దగా పట్టించుకోరు. మాకు అవి ఆలోచించే టైం లేదు. ఈ రోజు ఎన్ని రిజిస్ట్రేషన్ వచ్చాయి. రేపు ఎన్ని ఉన్నాయి అన్నది.. మాకు లెక్క అన్నట్లుగా వివరిస్తున్న రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. మండల కేంద్రమైన ముదిగొండ రెవెన్యూ సర్వే నెంబర్ 24 లో ప్రభుత్వ భూమి 13.38 ఎకరాల ఉండగా.. అందులో అక్రమంగా కొంందరు పాసు పుస్తకాలు చేయించుకోగా చివరికి 1.4 ఎకరాలు భూమి మిగిలి ఉంది. అది కూడా గుట్టగా ఉండటంతో ఎవరు స్పందించకపోవడంతో చుట్టుపక్కల ఉన్న కొంతమంది భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతే కాకుండా మిగిలి ఉన్న భూమిపై కూడా కన్ను వేసి.. మొత్తం భూమి మాదే అంటూ నేషనల్ హైవే రోడ్డు వాళ్లకు అక్రమంగా మట్టిని అమ్ముకున్నారు.

పది రోజులుగా అక్రమంగా మట్టి తోలుకుంటూ ముదిగొండ నడివోడ్డు నుండి వందల ట్రిప్పులు వెళుతున్న అటువైపు రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. రెవెన్యూ అధికారులు ఎప్పుడు రిజిస్ట్రేషన్‌లపై దృష్టి తప్ప ప్రజల సమస్యలపై, ప్రభుత్వాస్తులపై ఎటువంటి ఆలోచన లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులందరూ సర్టిఫికెట్లు సంతకాలు అంటూ రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే తిష్ట వేసినట్టు కూర్చోవడానికి తప్ప ప్రజల సమస్యలపై ఫీల్డ్ మీదకు వచ్చి చూసే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొంతమంది ప్రభుత్వ భూములలో అక్రమంగా వేల ట్రిప్పులు మట్టిని తరలించగా.. వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మండల ఆఫీసును వదిలి ప్రజల్లోకి వస్తే సమస్యలు పరిష్కరించవచ్చని మండల ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed