వెంచర్లో అక్రమ బ్లాస్టింగ్.. నలుగురిపై కేసు..

by Dishafeatures2 |
వెంచర్లో అక్రమ బ్లాస్టింగ్.. నలుగురిపై కేసు..
X

దిశ, తిరుమలాయపాలెం: ఎలాంటి అనుమతులు లేకుండా ఓ వెంచర్లో అక్రమ బ్లాస్టింగ్ నిర్వహిస్తుండగా టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. అనంతరం నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామ సమీపంలో, వేదుళ్లచెరువు రహదారి పక్కన కొంతమంది వ్యక్తులు నూతనంగా ప్రైవేట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు.

అ వెంచర్లో గుట్ట ఉండగా, కరిగించేందుకు గత కొన్ని రోజులుగా కొంతమంది వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా నాలుగు కంప్రెషన్ ట్రాక్టర్లతో డ్రిల్స్ వేసి జిలిటెన్ స్టిక్స్‌తో అక్రమ బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో వెంచర్లో దాడులు నిర్వహించి, అక్కడ లభ్యమైన జిలిటెన్ స్టిక్స్, అందుకు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటుగా నాలుగు కంప్రెషన్ ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వెంచర్ సూపర్వైజర్ చోటోమియా, నాగేశ్వరరావు, మరో ఇద్దరిపై పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి కేసు నమోదు అయినట్లు తెలిపారు.


Next Story

Most Viewed