- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పేదల ఆకలి తీరుస్తున్న వాట్సాప్ గ్రూప్..
by Sumithra |

X
దిశ, చింతకాని : చింతకాని మండల నాగులవంచ గ్రామంలో కొంతమంది యువకులు, గ్రామ పెద్దలు గ్రామంలో వున్న సమస్యలు, అవసరాల దృష్ట్యా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పేదలకు ఏదైనా సహాయం చేయాలి అని “ఆకలి అందరిది “అనే పేరుతో గత ఐదు సంవత్సరాల నుండి ప్రతి నెల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి వారికి నిత్యావసరాలతో కూడిన ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆదివారం నాగులవంచ గ్రామంలో ఆకలి అందరిది గ్రూప్ సభ్యులు నిరుపేద వృద్దురాలికి నిత్యావసరాలు అందించారు. గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ పేదల కోసం ఇలాంటి కార్యక్రమాలు మునుముందు మరెన్నో చేయడానికి సిద్ధంగా వున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు వంకాయలపాటి లచ్చయ్య, మునుకుంట్ల సుబ్బారావు, మదన్, కోండా గోపి, ఎవిరాజు, గోపి, బాటమ్రాజు, బుజ్జిబాబు తదితర గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు .
Next Story