కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు హైకోర్టు షాక్

by Disha Web Desk 15 |
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు హైకోర్టు షాక్
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : కొత్తగూడెం బీఆర్ఎస్ సెట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. 2018 ఎన్నికలలో వనమా వెంకటేశ్వరరావు అప్పిడివిటీలో తన ఆస్తుల వివరాలు తప్పుగా ఇచ్చినట్లు జలగం వెంకట్రావు హైకోర్టుని ఆశ్రయించారు. సుమారు నాలుగున్నర సంవత్సరాలు వాదోపవాదాలు విన్న అనంతరం వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని అంతేకాక తప్పుడు అపిడివిటీని ఇచ్చినందుకుగాను హైకోర్టు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి జలగం వెంకట్రావు పై 4300 పైచిలుకు ఓట్ల మెజారిటీతో వనమా గెలుపొందారు. వనమా గెలుపొందిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వనమా సమర్పించిన అపిడివిటీలో తప్పులు గ్రహించిన ప్రత్యర్థి జలగం వెంకట్రావు 2018 లో హైకోర్టుని ఆశ్రయించారు. నాలుగున్నర సంవత్సరాల సుదీర్ఘ వాదోపవాదాలు విన్న హైకోర్టు మంగళవారం నాడు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా కొనసాగుతారన్న హైకోర్టు తీర్పుతో జలగం అభిమానులు సంబరాలు చేస్తున్నారు. ఓటమి అనంతరం నుండి జలగం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో వనమా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది.

Next Story