- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏజెన్సీని జల్లెడ పడుతున్న పోలీసులు
by S Gopi |

X
దిశ, గుండాల: గుండాళం, తాడ్వాయి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురు కాల్పులు జరిగాయని ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో శనివారం నుండి పోలీసు బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ములుగు జిల్లాలోని తాడ్వాయి, ఏటురునాగారం, గోవిందరావుపేట, కొత్తగూడెం జిల్లాలోని గుండాల, ఆళ్లపల్లి కరకగూడెం, పినపాక, అశ్వాపురం, ఇల్లందు, మహబూబాద్ జిల్లాలోని గంగారం, పాకాల, కొత్తగూడం మండలాల్లో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా ఏజెన్సీ ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. వచ్చిపోయేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
Next Story