ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

by Sridhar Babu |
ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
X

దిశ,నేలకొండపల్లి : మండల కేంద్రంతో పాటు, అన్ని గ్రామాలలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయీ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు అందించారు. మండల కేంద్రంలోని ఆర్ సీఎం చర్చిలో ఫాదర్ సెబాస్టియన్ ఏసు క్రీస్తు అనుసరించిన శాంతి మార్గం, సిలువలో పలికిన ఏడు మాటల కోసం, ప్రపంచశాంతి కోసం సందేశం ఇచ్చారు. అంతకు ముందు క్రీస్తు సిలువ మార్గాన్ని అనుసరించి మండల పురవీధుల్లో సిలువ ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు పాల్గొన్నారు.



Next Story