ఘనంగా గోశాల ప్రారంభోత్సవ వేడుకలు

by Sridhar Babu |
ఘనంగా గోశాల ప్రారంభోత్సవ వేడుకలు
X

దిశ, భద్రాచలం : భద్రాచల క్షేత్రంలోని శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో గో - గోవింద సహిత గోశాల ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభించారు. గోమాతను సంరక్షించాలని తలచి సుందరమైన గోశాలను నిర్మాణం చేసి గోరక్షణ కొరకు కంకణం కట్టుకున్నది శ్రీ నృసింహసేవ వాహిని సంస్థ. అలానే 750 సంవత్సరాల నుండి తరతరాలుగా ఆరాధింపబడుతూ వస్తున్న కల్పవృక్ష నరసింహసాల గ్రామాన్ని కూడా భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ చైతన్య స్వామి

మాట్లాడుతూ గోవు ప్రాముఖ్యతను లోకానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో భద్రాద్రి దివ్య క్షేత్రంలో గో గోవింద కల్ప వృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమాన్ని నిర్మించి ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నామని చెప్పారు. నేడు ఎంతోమంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి స్వామివారిని, గోమాతలను దర్శనం చేసుకున్నారని, అలానే కోదాడకు చెందిన జొన్నలగడ్డ రమణస్వామి నారసింహ వేషధారణతో భక్తులను అలరింపజేశారు. అంతే కాకుండా గోకులంలో చిన్నారులు నాట్యాలతో భక్తులను ఓలలాడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి, ట్రస్టీ శ్రీధర్ స్వామి, వేద పండితులు శ్రీనివాస్ శర్మ, నవీన్, పవన్ కుమార్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed