గ్రామ సభలను ప్రజలు వినియోగించుకోవాలి.. ఎంపీడీవో చంద్రమౌళి..

by Sumithra |
గ్రామ సభలను ప్రజలు వినియోగించుకోవాలి.. ఎంపీడీవో చంద్రమౌళి..
X

దిశ, తల్లాడ : జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశానుసారం తల్లాడ మండలం వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నామని తల్లాడ ఎంపీడీవో చంద్రమౌళి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పథకాల్లో భాగంగా తల్లాడ మండలంలోని 27 గ్రామ పంచాయతీలో జనవరి 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామాల్లో నిర్ధారించిన ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో, ఇందిరమ్మ కమిటీ సమక్షంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గ్రామసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామ సభలు పూర్తిచేసే నివేదికను మండల పరిషత్ కార్యాలయంలో సమర్పించాల్సిందిగా వారు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed