- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గ్రామపంచాయతీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

దిశ, ములకలపల్లి : తమ డిమాండ్ల సాధన కోసం గ్రామ పంచాయతీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. బుధవారం ములకలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉద్యోగ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. సమ్మె మొదలై ఏడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నరటి ప్రసాద్, జేఏసీ జిల్లా జాయింట్ సెక్రెటరీ ఎండి.యూసుఫ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అవులూరి రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు కె.సాయి రత్న, బైటి అశోక్, దొంతుల సత్యం, మరీదు రామ్ సురేష్, జేఏసీ మండల అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు చిక్కుల శ్రీనివాసరావు, మేకల రమేష్ శంకర్, కుంజ శ్రీను, సోడే కేశ్వరరావు పాల్గొన్నారు.