ప్రభుత్వ భూమే.. టార్గెట్

by Disha Web Desk 1 |
ప్రభుత్వ భూమే.. టార్గెట్
X

తప్పుడు పత్రాలతో ధరణి లో పేరు నమోదు

దిశ, ముదిగొండ: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిపై ఓ బడా కాంట్రాక్టర్ కన్ను పడింది.వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని పారిశ్రామిక ప్రాంతంలో సర్వే నెం.162లో దాదాపుగా 80.32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రాంతం అంతా పెద్ద పెద్ద బండరాళ్లు ఉండటంతో ప్రభుత్వం అసైన్డ్ భూమిగా గుర్తించి ఆ స్థలాని ఓ ముగ్గురికి కేటాయించారు. విషయంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. ప్రభుత్వం గతంలో మొదటగా వీరయ్య అనే వ్యక్తికి అసైన్డ్ భూమి కేటాయించారు. కానీ 2010 నుంచి సర్వే నెం.162/ఇ లో 2.01 ఎకరాల స్థలం రెవెన్యూ రికార్డుల ప్రకారం అడంగల్ పహానీలో వాసుదేవరావు పేరుతో నమోదవుతూ వచ్చింది. 2015 నుంచి అనుభవదారు, పట్టాదారు రెండింటిలో తన పేరు కొనసాగుతూ వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓ వ్యక్తికి అసైన్డ్ భూమి కేటాయించి పక్షంలో తన వారసులకు తప్పా వేరొకరికి భూమిని విక్రయించడం నేరం. కానీ, అసైన్డ్ భూమి సదరు కాంట్రాక్టర్ వాసుదేవ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఏ విధంగా నమోదయ్యింది అనేది చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అధికారులు అందిన కాడికి దండుకొని అసైన్డ్ భూమిని పట్టా భూమిగా రికార్డుల్లో పేరు మార్చేశారని పలువురు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ధరణి సైట్లో డీఎస్ పెండింగ్ చూపిస్తున్న భూమిపై సదరు కాంట్రాక్టర్ వాసుదేవరావు సర్వహక్కులు పొందే ప్రమాదము లేకపోలేదు. అదే జరిగితే రూ.కో్ట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉంది

అక్రమిస్తే చర్యలు తీసుకుంటాం: తహసీల్దార్ శిరీష

వాసుదేవరావు అనే వ్యక్తికి నేను రాక ముందే రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉందని తహసీల్దార్ శిరీష అన్నారు. విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి తప్పుడు పత్రాలతో భూమిని పొందినట్లయితే ఉన్నతాధికారులకు పూర్తి అధికారులకు నివేదిక పంపి చర్యలు తీసుకుంటాం.


Next Story

Most Viewed