కృతికకు బంగారు పతకం

by Disha Web Desk 15 |
కృతికకు బంగారు పతకం
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ఇటీవల గుత్తికోయల దాడి లో హత్య కు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు సంస్మరణార్ధం హైదరాబాద్ జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో ఈనెల 5, 6 తేదీలలో జరిగిన రాష్ట్ర సబ్ జానియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు ప్రాతినిథ్యం వహించిన 10 సంవత్సరాల బాలికల లాంగ్ జంపులో కృతిక బంగారు పతకం సాధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహిధర్ ఈమేరకు తెలిపారు. అంతేకాక కొత్తగూడెంకు చెందిన వేదశ్రీ, షాట్ ఫుట్ లో బంగారు ,100 మీటర్ల పరుగుపందెంలో రజిత పతకాలు ,పాల్వంచ కు చెందిన బి.లోకేష్ 100 మీటర్ల పరుగుపందెం లో బంగారు పతకం, భద్రాచలంకు చెందిన ఎస్.కె అమ్రీన్ కు షాట్ పుట్ లో కాంశ్య పతకం సాధించారని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోహర్ రావు కృతిక కోచ్ మల్లికార్జున్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఫారెస్టు ఆఫీసర్ శ్రీనివాస రావు రోజూ స్టేడియం కు కృతికను తీసుకు వచ్చేవారని , జిల్లా అథ్లెటిక్ మీట్స్ కు కూడా స్పాన్సర్ చేశారని గుర్తు చేశారు. ఈ సందర్బంగా ద్రోణాచార్య అవార్డ గ్రహీత, నేషనల్ కోచ్ నాగపురి రమేశ్ కృతిక కు అథ్లెటిక్స్ లో మంచి భవిష్యత్​ ఉందని ప్రశంసించారు. రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.సారంగపాణి కృతికను, కోచ్ మల్లికార్జున్​ను అభినందించారు.


Next Story