16న వైఎస్​ఆర్​టీపీ పాలేరు నియోజకవర్గ క్యాంప్​ కార్యాలయానికి శంకుస్థాపన

by Sridhar Babu |
16న వైఎస్​ఆర్​టీపీ పాలేరు నియోజకవర్గ క్యాంప్​ కార్యాలయానికి శంకుస్థాపన
X

దిశ, ఖమ్మం రూరల్​ : ఈ నెల 16న రూరల్​ మండలం కరుణగిరి సమీపంలో వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ పాలేరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయ నిర్మాణానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల భూమి పూజ చేయనున్నట్లు ఆమె వ్యక్తిగత కార్యదర్శి భరత్​సింహరెడ్డి తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెపథ్యంలోనే ఇక్కడ క్యాంపు కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.



Next Story