బండి సంజయ్ కాదు.. నీ పేరు తొండి సంజయ్: మాజీ ఎమ్మెల్సీ బాలసాని ఫైర్

by Satheesh |   ( Updated:2022-05-16 16:19:40.0  )
బండి సంజయ్ కాదు.. నీ పేరు తొండి సంజయ్: మాజీ ఎమ్మెల్సీ బాలసాని ఫైర్
X

దిశ, ఖమ్మం టౌన్: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటాదని.. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ హెచ్చరించారు. సోమవారం ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఖమ్మం కులాలకు, మతాలకు అతీతంగా ప్రశాంతంగా ఉంది.. కానీ బీజేపీ పార్టీ చిచ్చు పెట్టాలని చూస్తుందని మండిపడ్డారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతికి మంత్రి అజయ్ కారణం అంటూ.. రోజుకొకరు ఖమ్మం టూరిస్టుల్లా వచ్చి విమర్శలు చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. సీబీఐ, ఈడీల పేరుతో బీజేపీ బెదిరించాలని చూస్తుందని.. అలాంటి తాటాకు చప్పుళ్లకు బయపడమని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అంటే బట్టేబాజ్ పార్టీ అని.. బీజేపీ పార్టీ నాయకులు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు.

నీ పేరు బండి సంజయ్ కాదని.. తొండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధి మీ కళ్ళకు కనపించడం లేదని అని ప్రశ్నించారు. కమ్మ సంఘం గురించి మాట్లాడే అర్హత నీకు లేదన్నారు. మంత్రి పువ్వాడపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. బీజేపీ నాయకులకు ఖమ్మం ఒక టూరిస్ట్ ప్లేస్‌గా మారిందని ఎద్దేవా చేశారు. మంత్రి అజయ్ కుమార్ గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్‌కు లేదన్నారు. అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్‌లో బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, మేయర్ నీరజ, కూరాకుల నాగ భూషణం, ఆర్‌జెసీ కృష్ణ, కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ, బచ్చు విజయ్ కుమార్, బొమ్మెర రాంమూర్తి, తాజుద్దీన్, తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed