ఏన్కూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్నిప్రమాదం

by Taduka Kalyani |

ఏన్కూర్ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఏన్కూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్నిప్రమాదం
X

దిశ, ఏన్కూర్ : ఏన్కూర్ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎండ తీవ్రత కారణంగా జనరేటర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బ్యాంకు సిబ్బందితో పాటు ఖాతాదారులు కూడా తమ అవసరాల నిమిత్తం బ్యాంకుకు వచ్చారు. ఒక్కసారిగా జనరేటర్‌లో మంటలు చెలరేగడంతో అక్కడ భయాందోళన నెలకొంది. ప్రమాదంలో సుమారు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. బ్యాంకు మేనేజర్ జగన్ నాయక్, సీనియర్ అసిస్టెంట్ రాకేష్‌తో పాటు ఇతర సిబ్బంది కూడా మంటల నివారణకు కృషి చేశారు. సమయానికి మంటలను అదుపులోకి తీసుకురావడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story