ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన నల్లగట్ల వేణు

by S Gopi |
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన నల్లగట్ల వేణు
X

దిశ, కల్లూరు: కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన నల్లగట్ల వేణుకు 2021-2022 సంత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఆదివారం ఖమ్మం టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ ప్రయివేటు టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. నల్లగట్ల వేణు విద్యాభ్యాసం కల్లూరు పట్టణంలో జరిగింది. వృత్తి రీత్యా ఖమ్మం పట్టణంలోని ఓ ప్రయివేటు కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా నల్లగట్ల వేణును ఎంపిక చేయడం జరిగింది. వేణుకు అవార్డు రావడం పట్ల గ్రామస్తులు, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు నల్లగట్ల కోటేశ్వరరావు, బొళ్ళిపోగు కృష్ణ, జొన్నలగడ్డ నవీన్, రాయల సుందరం, పరిగడువు రాము తదితరులు హర్షం వ్యక్తం చేశారు.



Next Story