బీఆర్​ఎస్​ సభ ఏర్పాట్ల పరిశీలన

by Sridhar Babu |
బీఆర్​ఎస్​ సభ ఏర్పాట్ల పరిశీలన
X

దిశ, ఖమ్మం సిటీ : ఈనెల 18వ తేదీన ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం సీపీ విష్ణు వారియర్స్ శనివారం పరిశీలించారు. పార్కింగ్ , రూట్ మ్యాప్, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరానున్నందున వారు నేరుగా బహిరంగ సభ వద్దకు చేరుకునే విధంగా సమీపంలోనే పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏ చిన్న పొరపాటు తలెత్తకుండా పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యక్తిగత నాయకులు రవి కిరణ్ , ట్రాఫిక్ ఏసీపీ రమేష్ , రూరల్ ఏసీపీ బసవ రెడ్డి , టౌన్ ఏసీబీ ఆంజనేయులు, సత్తుపల్లి ఏసీపీ వెంకటేష్, ఎస్బి ఏసీపీ ప్రసన్న, అడిషనల్ ఎస్పీ లు శబరి, బోస్ పాల్గొన్నారు.



Next Story