- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోయినా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు
దిశ,ఖమ్మం రూరల్ : చనిపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి రాంరెడ్డి వెంకట్ రెడ్డి అని రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రాంరెడ్డి శ్రీ చరణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురంలో గల టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో పాలేరు అభిమానుల ఆత్మీయ సమ్మేళనం బైరు హరినాథ్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. తొలుత అక్కడ ఏర్పాటుచేసిన చిత్రపటానికి పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు, నాయకులు పూలు వేసి ఘన నివాళులర్పించారు. అదే విధంగా రెండు నిమిషాల పాటు మౌనాన్ని పాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో
చరణ్ రెడ్డి మాట్లాడుతూ... కుటుంబ సభ్యులకు కష్టం వచ్చినా ఆగుతారేమోకానీ కార్యకర్తకు కష్టం వస్తే అర సెకను కూడా ఆలస్యం చేసేవారు కాదన్నారు. శత్రువు సైతం సాయం కోసం వస్తే కాదు అనకుండా తోడ్పాటుగా నిలిచిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. పాలేరు నియోజకవర్గ అభివృద్ధిలో వెంకన్న పాత్ర ఎంతో కీలకమైంది అన్నారు. లంబాడి సోదరీ ,సోదరీమణులు వెంకన్న అంటూ ఆప్యాయంగా పిలుచుకునే వారని ఆయన కూడా అదే ఆప్యాయత అనురాగాలను పంచేవారని గుర్తు చేసుకున్నారు. వెంకట్ రెడ్డి అంటే వ్యక్తి కాదు ఓ శక్తి అన్నారు. ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రజల గుండెల్లో తన స్థానం పదిలమన్నారు.
ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసిన నాడే మనం ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. మా పుట్టుక కాంగ్రెస్ మా చావు కూడా కాంగ్రెస్ తోనే ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం అభిమానులు నాయకులు మాట్లాడుతూ రాంరెడ్డి వెంకట్ రెడ్డి తో ఉన్న అనుబంధం, ప్రజల పట్ల ఆయన చూపే నిబద్ధత, గ్రామాల అభివృద్ధికై చేసిన కృషిని యాది చేసుకున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి సుమారు 4000 మంది అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మానుకొండ రాధా కిషోర్, వెంకట్ రెడ్డి అభిమాని నంద్యాల రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ బెల్లం శ్రీను ,
మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు పందిరి పద్మావతి , సర్పంచులు ఎరసాని శివారెడ్డి, ముత్యం చిన్న కృష్ణారావు, గోనే భుజంగ రెడ్డి, మౌనిక, రాజు, గూగులోత్ మోహన్, లోడిగా వెంకటరమణ ,ధరావత్ వెంకట్, ఉపేందర్, ఖాదర్ బాబు ,ఎంపీటీసీ లింగయ్య, పాలేరు నాయకులు మట్ట గురవయ్య, మద్ది వీరారెడ్డి, బోడ వెంకన్న, కందుకూరి వెంకటనారాయణ, కొర్ని సీతారాములు, బానోతు కిషోర్ నాయక్ , భూక్య సురేష్ నాయక్, హరి నాయక్, ఆరంపుల రామయ్య, బోయిన వేణు, పాపా నాయక్, బసు నాయక్, మంచా నాయక్, కరీం, శ్రీశైలం, చింతలపాటి రాజశేఖర్, భూక్య రాజేష్ తదితరులు పాల్గొన్నారు.