- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాలుగు సంవత్సరాల ఇబ్బందులకు ఎండ్….ఎట్టకేలకు పునరుద్ధరణ

దిశ, కారేపల్లి: కరోనా సమయంలో కారేపల్లి రైల్వే స్టేషన్ లో రద్దు చేసిన రిజర్వేషన్ కౌంటర్ ను రైల్వే అధికారులు ఎట్టకేలకు పునరుద్ధరించారు. ఖమ్మం జిల్లాలో ఏకైక రైల్వే జంక్షన్ అయిన కారేపల్లి రైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ కౌంటర్ లేకపోవడం వలన గత నాలుగు సంవత్సరాల నుండి ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ రైల్వే లైన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్న ఆ రైళ్లకు రిజర్వేషన్ కావాలన్నా, తత్కాల్ టికెట్లు కావాలన్నా ఈ ప్రాంత ప్రజలు ఖమ్మం కొత్తగూడెం లేదా డోర్నకల్ రైల్వే స్టేషన్లకు వెళ్లి రిజర్వేషన్ చేయించుకుని వచ్చి మళ్లీ కారేపల్లి లో రైలు ఎక్కాల్సిన దుస్థితి నెలకొని ఉండేది. దీంతో ఈ విషయం పై రైల్వే అధికారులకు పలుసార్లు మొరపెట్టుకోగా ఎట్టకేలకు రైల్వే అధికారులు శనివారం నుంచి రిజర్వేషన్ కౌంటర్ ను పునరుద్ధరించారు. రిజర్వేషన్ కౌంటర్ ను పునరుద్ధరించినందుకు రైల్వే అధికారులకు, సహకరించిన ప్రజాప్రతినిధులకు, సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ రైల్వే లైన్ లో రద్దు చేసిన మిగతా రైళ్లను కూడా పునరుద్ధరించి డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్డు వరకు గల అన్ని రైల్వే స్టేషన్లలో అన్ని రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని సామాజిక కార్యకర్త సురేందర్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు.